: రాణించిన రహానే, కోహ్లీ... టీమిండియా 175/2


ధర్మశాలలో టీమిండియా, విండీస్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో భారత జట్టు 32 ఓవర్లు ముగిసేసరికి ధావన్, రహానే వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (52), రైనా (17) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు జాగ్రత్తగా ఆడడంతో ఆరంభంలో టీమిండియా పెద్దగా స్కోరు చేయలేకపోయింది. ఇన్నింగ్స్ ఊపందుకుని, ఓపెనర్లు నిలదొక్కుకుంటున్నారనుకునేంతలో ధావన్ (35) అవుటయ్యాడు. అనంతరం, రహానే (68) వేగంగా ఆడుతూ అర్థ సెంచరీ సాధించాడు. అనంతరం కోహ్లీ అనవసర షాట్లకు ప్రయత్నించకుండా నిలకడ ప్రదర్శించి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News