: రజనీకాంత్ 'లింగా' షూటింగ్ లో అపశృతి
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'లింగా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ లైట్ మేన్ ఐదంతస్తుల భవనం నుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ లైట్ మేన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.