: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్ దారుల భారీ విరాళం
తుపాను సాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్ దారులు భారీ విరాళం ఇచ్చారు. రెండు రోజుల వేతనాన్ని ఉద్యోగులు విరాళంగా ఇచ్చినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఆ రెండు రోజుల మొత్తం రూ.125 కోట్లు సీఎం సహాయ నిధికి సమర్పించినట్లు చెప్పారు.