: క్రికెటర్ అతుల్ శర్మ నుంచి నాకు ముప్పు ఉంది: లియాండర్ పేస్
ఐపీఎల్ లో ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన అతుల్ శర్మ అనే క్రికెటర్ పై టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. శర్మ నుంచి తనకు ప్రమాదం ఉందంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శర్మ తనను, తన కుమార్తెను చంపుతానని బెదిరించినట్లు పేస్ ఫిర్యాదులో చెప్పాడు. కాగా, పేస్ మాజీ భార్య రియా పిళ్లైతో అతుల్ కు సంబంధం ఉన్నట్లు ఆరోపణ కూడా ఉంది. కొంతకాలం నుంచి విడిగా ఉంటున్న పేస్, రియాలు కుమార్తె విషయంలో ముంబయి స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. కూతురు రక్షణ బాధ్యత తనకే అప్పగించాలని పేస్ కోరాడు. కుమార్తెను తనకే అప్పగించాలని అటు రియా కూడా కోరుతోంది.