: సార్క్ పవర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్లాన్


సార్క్ దేశాల ఆధ్వర్యంలో సార్క్ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్ పిలుపునిచ్చారు. దీనివల్ల అధికంగా ఉత్పత్తయ్యే విద్యుత్తును లోటు ఉన్న మిగతా ప్రాంతాల్లో సులువుగా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు బెంగళూరులో జరిగిన ఐదవ సార్క్ ఎనర్జీ మినిస్టర్స్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. "నదులు కేవలం ఒక దిశలోనే ప్రవహిస్తాయి. కానీ, విద్యుత్ మనకు నచ్చిన దిశలో వెళుతుంది! కాబట్టి, రాబోయే రోజుల్లో ఎలాంటి అవాంతరాలు లేని సార్క్ పవర్ గ్రిడ్ ఏర్పాటవుతుందని ఆశిస్తున్నా. ఉదాహరణకు, ఈశాన్య భారతదేశంలో జల విద్యుత్ ఉత్పత్తి అయితే బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ కు రవాణా చేయవచ్చు. లేదా శ్రీలంక తీర సరిహద్దులలో పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే పాకిస్థాన్, నేపాల్ కు ఇవ్వొచ్చు. ఇలాంటి అవకాశాలు అపరిమితంగా ఉన్నాయి" అని గోయెల్ విపులంగా చెప్పారు. ఈ ఆలోచన కేవలం సార్క్ దేశాల ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసేందుకే కాకుండా, ప్రజల సంబంధాలను కూడా మరింత శక్తిమంతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News