: 'స్వచ్ఛ్ భారత్ అభియాన్'పై వీహెచ్ విమర్శలు


'స్వచ్ఛ్ భారత్ అభియాన్' పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన కార్యక్రమంపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమం కొత్తేమి కాదన్నారు. కాంగ్రెస్ నేతలు నెహ్రూ, రాజీవ్ గాంధీల కాలంలో చేపట్టినవేనని మీడియా ముఖంగా విమర్శించారు. ప్రచార ఆర్బాటం చేస్తున్నారని విమర్శించిన వీహెచ్... అందుకు కావల్సిన నిధులను కేటాయించి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. ఏదో చీపురు పట్టి మంత్రులు ఫోటోలు దిగినంత మాత్రాన రహదారులు క్లీన్ కావన్నారు.

  • Loading...

More Telugu News