: నన్ను మోడీతో పోల్చడం సరికాదు: షారుఖ్


ప్రధాని మోడీతో తనకు పోలిక పెట్టడం సరికాదంటున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. మోడీతో తనను పోల్చడాన్ని ఓ కాంప్లిమెంట్ గా స్వీకరిస్తానంటూనే, ఇలా పోల్చడం కొత్తగా ఉందన్నాడు. ఆయన వృత్తి వేరని, తన వృత్తి వేరని పేర్కొన్నాడు. షారుఖ్ తన తాజా చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' ప్రచారం కోసం ఇండోర్ వచ్చాడు. అక్కడ, రాజకీయాల్లో మోడీ ఎలాగో, చిత్ర పరిశ్రమలో షారుఖ్ అలాగన్న ఓ మీడియా ప్రతినిధికి బదులిస్తూ పై వ్యాఖ్యలు చేశాడు. "ఆయనో (మోడీ) పెద్ద నేత. ఆయనను ప్రజలు ఎంతగానో ప్రేమిస్తారు, ఎంతగానో అభిమానిస్తారు" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News