: ఆ న్యాయమూర్తిపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలొద్దు: అన్నాడీఎంకే కార్యక్తరలకు సుప్రీం సూచన


జయలలితకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అన్నా డీఎంకే కార్యకర్తలకు ఓ సూచన చేసింది. జయలలితకు శిక్ష ఖరారు చేసిన పరప్పన అగ్రహార కోర్టు న్యాయమూర్తి మైఖేల్ డి కున్హాపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు స్వస్తి పలకాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, హింసాత్మక చర్యలకు దిగకుండా సంయమనం పాటించాలని కూడా కోర్టు సూచించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలుతో పాటు రూ.100 కోట్ల జరిమానాను విధించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి డి కున్హాపై అన్నా డీఎంకే కార్యకర్తలు పరుష పదజాలంతో కూడిన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News