: జయ బెయిల్ పై సుప్రీంలో వాదనలు ప్రారంభం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాదులు పాలీ నారీమన్, సుశీల్ కుమార్, తులసి వాదనలు వినిపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షకు గురైన జయలలిత బెయిల్ పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో జయ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతున్న కోర్టు హాలు ముందు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు గుమిగూడారు. కోర్టు హాలు న్యాయవాదులలో కిక్కిరిసి ఉండటంతో ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. సదరు కోర్టు హాలు ముందు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.