: షిర్డీ-కాకినాడ ఎక్స్ ప్రెస్ లో దొంగల దోపిడీ


షిర్డీ-కాకినాడ ఎక్స్ ప్రెస్ లో దొంగలు తెగబడ్డారు. రైల్లోని ఎస్-1, ఎస్-3 బోగీల్లో దొంగలు దోపిడీ చేశారు. ఓ మహిళను కత్తితో గాయపరిచి బంగారం, నగదు తీసుకున్నారు. ఈ ఘటనలో సదరు మహిళ మెడ, తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని రోటీగావ్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం కాకినాడ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాదు చేరుకోగా, వెంటనే బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News