: సానియా మీర్జాపై ప్రధాని మోడీ ప్రశంసలు
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో భాగంగా గురువారం హైదరాబాద్ లో చీపురు పట్టిన సానియా మీర్జా ఉత్సాహంగా రోడ్లు ఊడ్చారు. ఈ విషయం తెలుసుకున్న మోడీ , సానియాకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ లో సానియా మీర్జాను ఆకాశాకెత్తేశారు. ‘సానియా మీర్జా చర్యలు స్వచ్ఛ్ భారత్ ను మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి. సానియా మీర్జా భాగస్వామ్యంతో స్వచ్ఛ్ భారత్ పై దేశవ్యాప్తంగా ప్రచారంతో పాటు అవగాహన పెరిగే అవకాశముంది’ అని మోడీ కొనియాడారు.