: అకౌంట్ బ్యాలెన్స్ ఆధారంగా ఏటీఎం ఛార్జీలు: ఎస్ బీఐ


భారతదేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ఏటీఎం లావాదేవీల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అకౌంట్ లో ఎక్కువ మొత్తాన్ని మెయింటెన్ చేసే వినియోగదారులకు ఎక్కువసార్లు ఏటీఎంను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎస్ బీఐ నిర్ణయించిన ఈ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు తన వెబ్ సైట్ లో ఓ నోటిఫికేషన్ ఉంచిన ఎస్ బీఐ, సగటున నెలకు రూ.25వేల నుంచి రూ.లక్ష బ్యాలెన్స్ నిర్వహించేవారు వారి ఏటీఎంలలో అపరిమిత స్థాయిలో ఉచిత లావాదేవీలు పొందుతారు. అదే ఇతర ఏటీఎంలలో నెలకు మూడుసార్లు, ఇతర కేంద్రాలలో ఐదుసార్లు ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా మెట్రో సిటీ (ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాదు) ఏటీఎంలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఖాతాలలో రూ.లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ నిర్వహించే వారికి ఎస్ బీఐ, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమతంగా ఉచిత లావాదేవీలు చేయవచ్చు. అటు రూ.25వేలకు తక్కువగా బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులు వారి బ్యాంకు ఏటీఎంలలో ఉచితంగా ఐదుసార్లు మాత్రమే ఉపయోగిచాలి. అదే మెట్రో సిటీలోని ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడుసార్లు ఉచితంగా, మెట్రో నగరాలు కానీ ప్రాంతాల్లో ఐదుసార్లు ఏటీఎం ఉపయోగించుకోవచ్చు.

  • Loading...

More Telugu News