: ఆరెస్సెస్ సమావేశాలకు అమిత్ షా: రామ మందిరంపై చర్చ?


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఆరెస్సెస్ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలతో పాటు అయోధ్య రామ మందిర నిర్మాణంపై చర్చ జరిగే అవకాశాలున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా, ఈ సమావేశాలకు మాత్రం స్వయం సేవక్ గానే హాజరవుతున్నారు. బీజేపీ తీసుకునే పలు నిర్ణయాలపై ఆరెస్సెస్ ప్రభావముంటోంది. ఈ నేపథ్యంలో కీలకాంశమైన రామ మందిర నిర్మాణంపైనా ఆయనతో ఆరెస్సెస్ నేతలు చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, జాతీయ అంశంగా మారిన రామ మందిరం నిర్మాణంపై బీజేపీతో తాము చర్చించేదేమీ లేదని ఆరెస్సెస్ కీలక నేత దత్తాత్రేయ హోస్బోలే చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా రామ మందిరం నిర్మాణ అంశం ఉందని, దీంతో ఈ విషయాన్ని బీజేపీనే చూసుకుంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News