: అన్నాడీఎంకే ఆవిర్భావ దినాన... జయకు బెయిల్ లభించేనా?


తమిళనాడు రాజకీయ చరిత్రలో సంచలన పార్టీగా ఖ్యాతిగాంచిన అన్నా డీఎంకే పుట్టిన రోజు నేడు. అయితే సరిగ్గా ఇదే రోజున ఆ పార్టీ అధ్యక్షురాలు జయలలిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రంకోర్టు విచారించనుంది. గతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్నా డీఎంకే కార్యకర్తలు ఘనంగా నిర్వహించేవారు. అయితే తాజాగా పార్టీ అధ్యక్షురాలు జైల్లో ఉండటం, ఆమె బెయిల్ పై విచారణ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే జరుగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో ఏమాత్రం ఉత్సాహం లేదు. వారి దృష్టి మొత్తం జయ బెయిల్ పిటిషన్ విచారణపైనే కేంద్రీకృతమైంది. మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమ నేతకు తప్పనిసరిగా బెయిల్ లభిస్తుందని పార్టీలోని మెజార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News