: ఆ ఎస్సెమ్మెస్ చనిపోయిన బామ్మగారి నుంచి అనుకుని హడలిపోయిన కుటుంబం!
చనిపోయిన వ్యక్తులతో పాటే వారికిష్టమైన కొన్ని వస్తువులను కూడా సమాధి చేస్తారు కొందరు. బ్రిటన్ లోని ఈ కుటుంబం కూడా అలాగే చేసింది. 2011లో లెస్లీ ఎమర్సన్ (59) అనే మహిళ మృతి చెందగా, ఆమెతో పాటే సెల్ ఫోన్ ను కూడా సమాధిలో ఉంచి అంత్యక్రియలు జరిపారు. అయితే, ఎమర్సన్ ఫోన్ కు మనవరాలు షేరి (22) తరచూ టెక్ట్స్ మెసేజ్ లు పంపేది. అయితే, ఇటీవలే ఓ రిప్లయ్ రావడంతో షేరి షాక్ కు గురైంది. "నిన్ను గమనిస్తూనే ఉన్నాను" అన్నది ఆ మెసేజ్ సారాంశం. అది చదివిన వెంటనే దిగ్భ్రాంతి చెందానని, ఏం చేయాలో తోచలేదని షేరి మీడియాకు తెలిపింది. ఆమె అంకుల్ ఆ నెంబర్ కు ఫోన్ చేయగా, ఓ వ్యక్తి అదే నెంబర్ ను కలిగి ఉన్నట్టు తెలిసింది. ఎమర్సన్ సిమ్ కార్డు కాలపరిమితి ముగియడంతో, అదే నెంబర్ ను మరొకరికి కేటాయించారట. అదీ విషయం!