: ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా నేడు భూమా అఖిల నామినేషన్


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుత ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా శోభానాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియను బరిలోకి దించాలని వైఎస్సార్సీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. నేటి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అఖిల ప్రియ నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 8న పోలింగ్ జరగనుండగా, అదే నెల 12న ఓట్ల లెక్కంపును ఎన్నికల సంఘం చేపట్టనుంది.

  • Loading...

More Telugu News