: కృష్ణాజిల్లా లారీ యజమానుల సంఘం, హస్పిరా ఫార్మాల విరాళం
తుపాను బాధితులకు ఆర్థిక సహాయం చేసేందుకు పలు సంస్థలు, ఇతరులు ముందుకొస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా లారీ యజమానుల సంఘం రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించింది. అటు హస్పిరా ఫార్మా కంపెనీ రూ.60 లక్షల విరాళాన్ని విశాఖలో సీఎం చంద్రబాబుకు అందించింది. హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న నటుడు సచిన్ జోషీ రూ.15 లక్షలు ప్రకటించారు. తనను అభిమానించే తెలుగు ప్రజలకు ఇలాంటి దుస్థితి రావడం దురదృషకరమన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని సచిన్ ఆకాంక్షించారు.