: నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
అణ్వస్త్రాలను మోసుకుపోగల నిర్భయ్ క్షిపణిని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ టెస్ట్ రేంజ్ లో నిర్భయ్ ప్రయోగం జరిగింది. 700 కిలోమీటర్ల లక్ష్యాలను ఈ క్షిపణి చేధించగలదు. చెట్టు ఎత్తులో ఎగురుతూ రాడార్ లకు దొరక్కుండా ప్రయాణించడం ఈ క్షిపణి ప్రత్యేకత.