: కేసీఆర్ చదువుకున్న పాఠశాలకు రూ. 4.15 కోట్లు
చిన్నప్పుడు కేసీఆర్ చదువుకున్న దుబ్బాక ఉన్నత పాఠశాలకు మహర్దశ పట్టింది. పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఏకంగా రూ. 4.15 కోట్లను టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. విద్యార్థి దశలో తన స్వస్థలమైన చింతమడక నుంచి కాలినడకన దుబ్బాక వచ్చి... ఈ పాఠశాలలో కేసీఆర్ చదువుకున్నారు. 1960లో వాడుకలోకి వచ్చిన పాఠశాల భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది.