: నేడు విశాఖ ఏజన్సీలో పర్యటించనున్న చంద్రబాబు
హుదూద్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. విశాఖలో ప్రజాజీవనం మెరుగైన నేపథ్యంలో, ఈ రోజు ఆయన విశాఖ ఏజన్సీలో పర్యటించనున్నారు. విశాఖ నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ లో పాడేరు చేరుకుంటారు. అనంతరం, లాడపుట్టు, మత్స్యగడ్డ, ఈరడపట్టి, శ్రీకృష్ణాపురం ప్రాంతాల్లో పర్యటించి... తుపాను సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు.