: భారత్ పై విషం చిమ్మిన ముషారఫ్


కార్గిల్ యుద్ధానికి కారకుడైన పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరోసారి భారత్ పై విషం కక్కారు. కాశ్మీర్ ప్రజలను ఎప్పుడూ రెచ్చగొడుతూనే ఉండాలంటూ... భారత్ పై తన విద్వేషాన్ని వెళ్లగక్కారు. కాశ్మీర్ లో పోరాడేవారికి పాక్ పూర్తి సహాయసహకారాలు అందించాలని సూచించారు. పాక్ సైన్యం, కాశ్మీర్ యువత చేయి కలిపితే భారత్ ను ఎదుర్కోవడం సులభతరం అవుతుందని అన్నారు. మరోవైపు, భారత ప్రధాని మోడీపై కూడా ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఒక మతవాది అంటూ విమర్శించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

  • Loading...

More Telugu News