: మా దగ్గర 4 వేల మంది ఉన్నారు... పంపమంటారా, బాబూ?: టాటా గ్రూప్ ఛైర్మన్
తుపాను బాధితులకు సహాయం అందించేందుకు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఏపీ సీఎంకి ఫోన్ చేసి, తమ సంస్థలో నిపుణులైన 4 వేల మంది సిబ్బంది ఉన్నారని, చెక్క పనులు, విద్యుత్ పరికరాలు, తీగలు, మోటార్ల మరమ్మతులు, అద్దాలు, టైల్స్ అమర్చడం వంటి పనులు చిటికెలో చేస్తారని తెలిపారు. వారిని పంపమంటే పంపుతామని, అవసరమైన వస్తువుల్ని సంబంధిత వ్యక్తులు కొనుగోలు చేస్తే మరమ్మతులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తి స్వయంగా చంద్రబాబును కలసి దారుణంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాలను తమకు కేటాయిస్తే పనులు చేపడతామని ఆమె స్పష్టం చేశారు.