: ప్రభుత్వ సిబ్బందిని అభినందిస్తున్న ప్రజలు


ప్రభుత్వ సిబ్బందిని అభినందించాలంటే పౌరులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఎంతో నిబద్ధతతో పని చేసే ప్రభుత్వోగి అయితే కానీ ప్రజల మన్ననలు అందుకోలేడు. కానీ ఆంద్రప్రదేశ్ లో హుదూద్ తుపాను ధాటికి విశాఖపట్టణం కకావికలమైపోయింది. దీంతో అక్కడ సేవలు అందించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వోద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ విలువైన సేవలు అందిస్తున్నారు. శక్తివంచన లేకుండా సేవలందిస్తూ విశాఖను వీలైనంత త్వరగా కోలుకునేందుకు సహాయపడ్డారు. దీంతో ప్రతి ప్రభుత్వోద్యోగికి విశాఖ ప్రజలు అభినందనలు, ధన్యావాదాలు తెలుపుతున్నారు. తెలుగు వారు కానప్పటికీ తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చి సేవలు అందిస్తున్న ఉద్యోగులకు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News