: 88 లక్షల దరఖాస్తులు అందాయి
తెలంగాణ రాష్ట్రంలో ఆహారభద్రత పథకం కోసం ప్రజల నుంచి అందిన దరఖాస్తులు 68 లక్షలు అందాయని అధికార వర్గాలు తెలిపాయి. పింఛన్ల కోసం మరో 30 లక్షల దరఖాస్తులు అందాయని వారు వివరించారు. నిజామాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో రేపటి నుంచి దరఖాస్తులు పరిశీలించనున్నారు. అయితే దరఖాస్తులు అందజేసేందుకు ప్రభుత్వం మరింత గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మరిత పెద్దఎత్తున దరఖాస్తులు అందే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.