: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సాన్ని ప్రజలకు లేఖలో వివరించారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆయన స్పష్టం చేశారు. తుపాను కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన నష్టం నుంచి కోలుకోకముందే హుదూద్ పేరిట మరో దెబ్బతగలిందని ఆయన అన్నారు. తుపాను కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. తుపాను నష్టనివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన లేఖలో తెలిపారు.