: ఆహార భద్రత, పింఛన్లకు 20వ తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత, పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువును పెంచింది. ఈ నెల 20 తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే తెల్ల కాగితంపై దరఖాస్తు చేయాలని ప్రజలను కోరామన్నారు. అందులో వివరాలు తప్ప ఎలాంటి ధృవపత్రాలు జతపరచాల్సిన అవసరం లేదని వివరించారు. అర్హులందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.