: ప్రధాని ప్రకటించిన రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయండి: ఎంపీ కంభంపాటి
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఎంపీలు కంభంపాటి హరిబాబు, సీఎం రమేష్ కలిశారు. హుదూద్ తుపాను బాధితులకు ప్రధానమంత్రి ప్రకటించిన రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. అంతేగాక, రాష్ట్రానికి మరింత సాయం కూడా చేయాలని అడిగినట్లు అనంతరం మీడియాకు తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపాలని, తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని కూడా రాజ్ నాథ్ సింగ్ ను అడిగారు. స్పందించిన హోంమంత్రి నష్టం అంచనాకు కేంద్ర బృందాలను తక్షణమే పంపిస్తామని చెప్పినట్లు ఎంపీలు తెలిపారు.