: చీపురు పట్టిన సానియా మీర్జా
టెన్నిస్ తార సానియా మీర్జా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొంది. హైదరాబాదులోని ప్రశాసన్ నగర్ లో చీపురు పట్టి చాలా ఉత్సాహంగా చెత్తను ఊడ్చింది. దాంతో, సానియాను చూసేందుకు పలువురు అక్కడకు రాగా, కొద్దిసేపు ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అనంతరం, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, షూటర్ అభినవ బింద్రాలను స్వచ్ఛ భారత్ కోసం సానియా నామినేట్ చేసింది.