: నాటి 'మిస్టర్ ఇండియా'కు విదేశీగడ్డపై ఆదరణ!
ప్రముఖ నటుడు అనిల్ కపూర్, అతిలోక సుందరి శ్రీదేవి 1987లో నటించిన 'మిస్టర్ ఇండియా' చిత్రాన్ని ఇండియానా యూనివర్శిటీలో ఈ నెల 7న ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇందుకు ఆహ్వానం అందుకున్న అనిల్ కూడా అక్కడికి వెళ్లి విద్యార్థులు, సిబ్బంది సరసన కూర్చుని మరీ సినిమా చూశాడు. అనంతరం ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్ లో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు అనిల్ చాలా సరదాగా సమాధానం ఇచ్చాడు. తను చేసిన చాలా సినిమాలు ఉండగా, ఈ సినిమానే ఎందుకు ఎంచుకున్నారని తాను క్యూరేటర్ జాన్ ను అడగ్గా, ఇందుకు చాలా కారణాలున్నాయని, ముఖ్యంగా మిస్టర్ ఇండియా 'తొలి రియల్ సూపర్ హీరో ఫిల్మ్' అని ఆయన చెప్పారని అనిల్ వెల్లడించాడు. అంతేగాక, ఆ సినిమాలో తన క్యారెక్టర్ ఉండే ఇంటి సెట్ గురించి విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిపారు. చూస్తుంటే అది నిజమైన ఇల్లులా ఉందన్నారని తెలిపాడు. ఈ సినిమాలో నటించిన దివంగత నటుడు అమ్రిష్ పురీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.