: తెలంగాణలో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు భారీ స్పందన


తెలంగాణ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల నుంచి పెద్దఎత్తున స్పందన లభించిందని తెలంగాణ రాష్ట్ర పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 1893 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు బిడ్లు ఆహ్వానించామని, బిడ్లు వేసేందుకు 108 మంది ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు నెల రోజుల్లో బిడ్లు ఖరారు చేయనున్నామని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News