: వీళ్ళకంటే అమెరికా విద్యార్థులే ఆరోగ్యవంతులట!


అమెరికా, బ్రిటన్... ప్రపంచ అగ్రరాజ్యాల్లో తొలి రెండు స్థానాల్లో ఉండే దేశాలు. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఉన్నతస్థాయిలో ఉంటాయి. అయితే, బ్రిటన్ విద్యార్థుల కంటే అమెరికా విద్యార్థులే ఆరోగ్యవంతులని ఓ అధ్యయనం చెబుతోంది. భౌతిక కార్యకలాపాలు, ఆరోగ్యకరమైన ఆహారం, తక్కువ పొగ తాగడం వంటి విషయాల్లో అమెరికా స్టూడెంట్లే మెరుగ్గా ఉన్నారని అమెరికన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ స్టేసీ స్నెల్లింగ్ తెలిపారు. అమెరికా విద్యార్థులు పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవడం గమనించామని, క్రీడల్లో ఎక్కువగా పాల్గొంటున్నారని, పొగ తక్కువగా తాగుతున్నారని స్నెల్లింగ్ వివరించారు. బ్రిటన్ విద్యార్థులు రోజుకు 1.5 శాతం పండ్లు/కూరగాయలు తీసుకుంటుండగా, అదే సమయంలో అమెరికా విద్యార్థులు 3.5 శాతం పండ్లు/కూరగాయలు తింటున్నారట. అమెరికా కాలేజీ యువతలో 16 శాతం మాత్రమే స్మోక్ చేస్తుండగా, బ్రిటన్ విద్యార్థులు 39 శాతం మంది స్మోకర్లేనని అధ్యయనం చెబుతోంది. 23 ఏళ్ళ లోపు యువతీయువకులను ఈ సర్వేలో పరిశీలించారు. వారిలో అమ్మాయిలే అధికమట.

  • Loading...

More Telugu News