: గాయాలపాలైన ట్రైనీ ఐపీఎస్ అధికారి


శిక్షణలో భాగంలో ఫైరింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు తలకు గన్ తగిలి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆనంద్ కులకర్ణి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అనంతగిరి వద్ద జరిగింది. గాయపడిన కులకర్ణిని వెంటనే వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఘటనా స్థలిని జిల్లా ఎస్పీ రాజకుమారి సందర్శించారు.

  • Loading...

More Telugu News