: అన్నీ అనుకూలిస్తే భారత్ లో ఫిఫా 'క్లబ్ వరల్డ్ కప్'!


భారత్ లో ఐఎస్ఎల్ పుణ్యమా అని సాకర్ పై కొద్దోగొప్పో క్రేజ్ పెరుగుతోంది. ఇదే ఊపులో మరికొన్ని మేజర్ టోర్నమెంట్లకు ఆతిథ్యమిచ్చేందుకు ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) తహతహలాడుతోంది. ఇప్పటికే ఫిఫా అండర్-17 కప్ నిర్వహణ అవకాశాన్ని దక్కించుకున్న భారత్... అండర్-20 వరల్డ్ కప్ ఆతిథ్యం కోసం బిడ్ వేయాలని నిర్ణయించుకుంది. అటుపై 2017-18 క్లబ్ వరల్డ్ కప్ కు కూడా బిడ్ దాఖలు చేయాలని భావిస్తోంది. దీనిపై ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ, అండర్-20 వరల్డ్ కప్ కు బిడ్ వేస్తామని, ఈ మేరకు ప్రాథమిక చర్యలు పూర్తయ్యాయని తెలిపారు. అంతేగాక, క్లబ్ వరల్డ్ కప్ కు కూడా బిడ్ వేస్తామని చెప్పారు. కాగా, ప్రస్తుతం భారత్ లో ఉన్న ఫిఫా సెక్రటరీ జనరల్ జెరోమ్ వాల్కే ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... 2015-16, 2017-18 క్లబ్ వరల్డ్ కప్ టోర్నీలపై మొరాకోలో జరిగే ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News