: కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరిషి నియామకం


కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మయారామ్ పర్యాటక శాఖకు బదిలీ అయ్యారు. ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ మెహరిషి నియమితులయ్యారు. ఈ మేరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానిగా మోడీ పదవి చేపట్టిన తర్వాత అత్యున్నత స్థాయి అధికారి బదిలీ ఇదే. ఇప్పటిదాకా ఆర్థిక శాఖ కార్యదర్శిగానే కాక ఎకనమిక్ అఫైర్స్ కార్యదర్శిగానూ పనిచేసిన మయారామ్ ను యూపీఏ ప్రభుత్వం ఆ పదవిలో నియమించింది. రాజస్థాన్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారిగా కొనసాగుతున్న రాజీవ్ మెహరిషి ఇకపై కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో కొనసాగనున్నారు.

  • Loading...

More Telugu News