: సెల్ ఫోన్ ఆపరేటర్లపై చంద్రబాబు మండిపాటు
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ కలెక్టరేట్ లో సెల్ ఫోన్ ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఇంకా పునరుద్ధరించకపోవడం దుర్మార్గమన్నారు. లాభాలు తప్ప ప్రజల ఇబ్బందులు పట్టవా? అని ప్రశ్నించారు. మీరే సరిగా స్పందించి ఉంటే రెండు రోజుల్లోనే కమ్యూనికేషన్ పునరుద్ధరణ జరిగేదని బాబు చెప్పారు. ఫోన్లకు ఛార్జింగ్ లేనందువల్లే మొబైల్ వినియోగం తగ్గిందని, ఛార్జీలు లేని రోమింగ్ సౌలభ్యం ఇవ్వాలని బాబు కోరారు. అటు సమావేశానికి రాని సెల్ ఫోన్ ఆపరేటర్ల ఇంటికి పోలీసులను పంపాలని సీఎం ఆదేశించారు. అదే సందర్భంలో మాట్లాడిన సెల్ ఫోన్ అపరేటర్లు, ప్రభుత్వం అంచనాలను అందుకోలేకపోయామని వివరణ ఇచ్చుకున్నారు.