: జయలలిత కేసులో తీర్పిచ్చిన జడ్జిపై లాయర్ విమర్శలు... కేసు నమోదు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు ఇచ్చిన కర్ణాటక ప్రత్యేక కోర్టు జడ్జి జాన్ మైఖేల్ కున్హపై న్యాయవాది ఒకరు విమర్శలు చేశారు. ఏఐఏడీఎంకే తరపున ఈ కేసులో పనిచేస్తున్న తంగా కొలాన్జినాథన్ అనే లాయర్ తిట్టకుడి ప్రాంతం వద్ద ఓ బ్యానర్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. దానిపై "న్యాయం నష్టపోయింది, అన్యాయం గెలిచింది" అంటూ జడ్జి కున్హపై ఆరోపణలు చేసినట్లు చెప్పారు. అంతేగాక ఏఐఏడీఎంకే రాజకీయ ప్రత్యర్థులు, డీఎంకే అధినేత కరుణానిధిపైనా విమర్శలు చేశాడన్నారు. వెంటనే అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.