: నవ్యాంధ్ర... పొరుగు రాష్ట్రాల పెట్టుబడులను ఎగరేసుకుపోతోంది!


రాష్ట్ర పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల పెట్టుబడులకు ప్రమాదకారిగానే మారింది. తొలుత తెలంగాణలో తమ వాహనాల ఉత్పత్తి యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన హీరో మోటో కార్ప్, ఆ తర్వాత ఏపీవైపు మొగ్గు చూపింది. ఏపీలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వంతో సదరు సంస్థ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. నిరంతర విద్యుత్ ను సరఫరా చేస్తామన్న ఏపీ ఆఫర్ తోనే హీరో ఆ రాష్ట్రం వైపు మొగ్గుచూపిందని దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కర్ణాటకలో రెండు భారీ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమైన ఏసియన్ పెయింట్స్ కూడా తాజాగా తన ప్రతిపాదనను రద్దు చేసుకుంది. కర్ణాటకలో రద్దు చేసుకున్న ఉత్పత్తి ప్లాంట్లను ఏపీలో నిర్మించనున్నట్టు ఆ సంస్థ ఆ తర్వాత ప్రకటించింది. దక్షిణ ఆంధ్రా, కోస్తాంధ్రలో ఒకటి చొప్పున రెండు ప్లాంట్లను ఏసియన్ పెయింట్స్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆ కంపెనీ రూ. 2 వేల కోట్ల మేర పెట్టుబడులను పెట్టనుంది. నిరంతర విద్యుత్ తో పాటు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పలు ప్రోత్సాహకాలు, ఏసియన్ పెయింట్స్ మనసు మార్చాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏకంగా ప్రధాని మోడీ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఏపీ తరహాలోనే తమకూ పన్ను మినహాయింపులు ప్రకటించాలని కోరారట.

  • Loading...

More Telugu News