: పాశ్చాత్య విద్య అంశం భారతీయ సంస్కృతిని దెబ్బ తీసింది: రాజ్ నాథ్ సింగ్
బ్రిటీష్ వారు తీసుకొచ్చిన పాశ్చాత్య విద్యా విధానం భారతీయ సంస్కృతిని, విలువలను తీవ్రంగా దెబ్బ తీసిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుత వ్యవస్థ విద్య యొక్క ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడంలేదని పేర్కొన్నారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఓ పాఠశాల శత వార్షిక వేడుకల్లో కేంద్ర హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "విద్య అనేది వ్యక్తి సమగ్ర అభివృద్ధికి సంబంధించినది. కానీ, ప్రస్తుత విద్యా వ్యవస్థ ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడంలేదు" అని వాపోయారు.