: పవన్ కల్యాణ్ కు కితాబిచ్చిన చంద్రబాబు
హుదూద్ తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అనంతరం ఇద్దరూ కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, బాధితులను ఆదుకోవడానికి పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారని పొగడ్తల వర్షం కురిపించారు. తుపాను బాధితుల సహాయార్థం భారీ మొత్తంలో విరాళం అందించడమే కాకుండా... స్వయంగా బాధితులను పరామర్శించడానికి రావడం ఆనందదాయకమని కొనియాడారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు... పవన్ చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. ప్రముఖులు ఎంతో మంది విరాళాలను ప్రకటిస్తూ... తమ పెద్ద మనసును చాటుకుంటున్నారని అన్నారు.