: ఏలూరు పోలీసులపై నమ్మకం లేదు: పెద్దఅవుటపల్లి మృతుల బంధువులు
కృష్ణా జిల్లా పెద్ద అవుటపల్లి కాల్పుల ఘటన విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పేరిట ఏలూరు పోలీసులు తమను వేధిస్తున్నారంటూ పెద్ద అవుటుపల్లికి చెందిన మృతుల బంధువులు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు పోలీసులవల్లే తమ వారు మృతి చెందారని వారు ధ్వజమెత్తారు. వారి వల్ల తమకు న్యాయం జరగదని వారు విజయవాడ కమిషనర్ కు మొరపెట్టుకున్నారు. ఏలూరు పోలీసులపై నమ్మకం లేకే తాము విజయవాడ పోలీసులను ఆశ్రయించామని వారు తెలిపారు. విచారణ వేగవంతం చేసి అసలు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వారు వేడుకున్నారు. తమను పలు మార్లు పోలీస్ స్టేషన్ కు పిలిపించి నిర్దయగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.