: అంగారకుడిపై 68 రోజులకంటే ఎక్కువ బతకలేరు!
అంగారకుడిపై మనిషి 68 రోజుల కంటే ఎక్కువ రోజులు బతకడం అసాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. మనుషులు నివసించడానికి అంగారక గ్రహం అనువైనదంటూ, 2025 కల్లా అక్కడ నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ఓ ఎన్జీవో ప్రకటించింది. ఈ నేపధ్యంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ను తయారు చేసి సరఫరా చేస్తామని ఆ ఎన్జీవో తెలిపింది. మట్టిలోంచి తాగునీరు తీస్తామని చెప్పింది. దీనిపై పరిశోధనలు చేసిన ఎమ్ఐటీ ఇంజనీర్లు, ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని, ఎంత ప్రయత్నించినా, మనిషి మార్స్ పై 68 రోజులకు మించి బతకలేడని స్పష్టం చేశారు. దీంతో మార్స్ వన్ ప్రాజెక్టు ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనపడడం లేదు.