: హర్యానా బీజేపీదే: ఎగ్జిట్ పోల్స్
హర్యానాలో 73 శాతం పోలింగ్ జరగడంతో విజయం ఎవరిదనే ఆసక్తి అందర్లోనూ రేగుతోంది. దీంతో టుడే చాణక్య ఎగ్సిట్ పోల్స్ ను వెల్లడించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించనుందని తెలిపింది. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ 52 స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఐఎన్ఎల్ డీకి 23 స్ధానాలు ఓటర్లు కట్టబెట్టనున్నారని, కాంగ్రెస్ కేవలం 10 స్థానాలకే పరిమితమవుతుందని పోల్స్ స్పష్టం చేశాయి. ఇతరులు 5 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తారని పోల్స్ వివరించాయి.