: తెలంగాణ సీఏం క్యాంపు కార్యాలయం ఎస్ఐబీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఖరారైంది. వాస్తుపై విశేషమైన నమ్మకమున్న కేసీఆర్, ప్రస్తుత క్యాంపు కార్యాలయం వాస్తు సరిగా లేదన్న కారణంగా దానిని వినియోగించుకోవడం మానేశారు. కొత్త క్యాంపు కార్యాలయం కోసం అధికారులు గాలించారు. సీఎం అధికారిక నివాసం ఎదురుగా ఉన్న స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) భవనంను క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోనున్నారు. కేసీఆర్ అధికారిక నివాసంలో సందర్శకులను కలుసుకునేందుకు వీలుపడకపోవడంతో క్యాంపు కార్యాలయం కోసం తీవ్రంగా అన్వేషించారు. ఆ భవనంలో మరమ్మతుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది.