: దేవుళ్ళ బొమ్మలున్న లెగ్గింగ్స్ ను వెబ్ సైట్ నుంచి తొలగించిన అమెజాన్.కామ్


ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ రిటైల్ అమ్మకాల సంస్థ అమెజాన్.కామ్ తన వెబ్ సైట్ నుంచి కొన్ని లెగ్గింగ్స్ ను తొలగించింది. ఆ దుస్తులపై హిందూ దేవుళ్ళ బొమ్మలుండడంతో, అమెరికాలో నిరసన వ్యక్తమైంది. దుస్తులపై హిందూ దేవుళ్ళ బొమ్మలను ముద్రించడంపై, అమెరికాలోని ప్రముఖ హిందూ మతగురువు రాజన్ జేడ్, అమెజాన్.కామ్ కు తీవ్ర నిరసన తెలిపారు. హిందువులు తమ దేవుళ్ళను ఆలయాల్లో, నివాసాల్లోని పూజా మందిరాల్లో మాత్రమే ఆరాధించడానికే ప్రాధాన్యం ఇస్తారని జేడ్ పేర్కొన్నారు. అంతేగానీ, దేవతల బొమ్మలు ముద్రించిన దుస్తులను కాళ్ళపైనా, కటి భాగంపైనా ధరించడాన్ని ఇష్టపడరని ఆయన అమెజాన్.కామ్ కు తెలిపారు. అమెరికాలోని హిందూ వర్గం అభ్యంతరాలపై వెంటనే స్పందించిన ఈ ఆన్ లైన్ మార్కెటింగ్ దిగ్గజం తన వెబ్ సైట్ నుంచి సదరు లెగ్గింగ్స్ ను తొలగించింది. కాగా, ఆ లెగ్గింగ్స్ పై గణేశుడు, శివుడు, బ్రహ్మ, విష్ణు, మురుగన్, హనుమాన్, రాముడు, రాధ-కృష్ణ, కాళి తదితరుల బొమ్మలున్నాయి.

  • Loading...

More Telugu News