: సినీ పరిశ్రమ నుంచి తాజా విరాళాలు


హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ నుంచి తాజాగా మరికొందరు విరాళాలు ప్రకటించారు. దర్శకులు వీవీ వినాయక్ రూ.10 లక్షలు, శ్రీను వైట్ల రూ.5 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.10 లక్షలు, బోయపాటి శ్రీను రూ.7 లక్షలు, గోపీచంద్ మలినేని రూ.లక్ష, కోన వెంకట్ రూ.లక్ష ప్రకటించారు. అటు, హీరోలు అక్కినేని నాగార్జున రూ.20 లక్షలు, కల్యాణ్ రామ్ రూ.10 లక్షలు ఇవ్వనుండగా, నిర్మాత ప్రతాప్ కొల్లగట్ల రూ.లక్ష ప్రకటించారు. ఇక, గ్రాన్యూల్ ఇండియా లిమిటెడ్ సంస్థ రూ.25 లక్షలు, ఎయిర్ కోస్టా రూ.25 లక్షలు ఏపీ సీఎం సహాయనిధికి ప్రకటించాయి.

  • Loading...

More Telugu News