: పోతూపోతూ మరో ఏడుగురి ప్రాణాలు బలిగొన్న 'హుదూద్'
హుదూద్ తుపాను ఏపీ, ఒడిశాలపై తీవ్ర ప్రభావం చూపడం తెలిసిందే. అయితే, అది బలహీన పడి ఉత్తర దిశగా పయనించి నేపాల్లోనూ విధ్వంసం సృష్టించింది. నేపాల్లోని ముస్తాంగ్ ప్రాంతంలో పర్వతారోహణ చేస్తున్న ఏడుగురు వ్యక్తులు హుదూద్ ధాటికి ప్రాణాలు విడిచారు. మరణించిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. మంచు తుపాను (అవలాంచే) కారణంగానే వీరందరూ మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. గత రెండ్రోజులుగా నేపాల్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరికొందరు విదేశీ సాహసికులను రక్షించినట్టు నేపాల్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నదని అధికారులు చెప్పారు.