: తుపాను బాధితులకు వీహెచ్ ఆర్థిక సాయం


హుదూద్ తుపాను బాధితులకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు తనవంతు సాయం అందించారు. ఈ మేరకు తన నెల జీతం రూ.50వేలు ఏపీ సీఎం సహాయనిధికి ఇచ్చినట్లు మీడియా ముఖంగా తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో తెలుగు రాష్ట్రాలు భేదాభిప్రాయాలు వదిలేసి అన్నదమ్ములుగా ఒకరికొకరు సాయం చేసుకోవాలని సూచించారు. తమ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. తాను కూడా శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు ఈ నెల 18న వెళ్లి బాధితుల సమస్యలు తెలుసుకుంటానన్నారు.

  • Loading...

More Telugu News