: అసెంబ్లీ ఎన్నికలను 'ధూమ్ 2'తో పోల్చిన ప్రకాశ్ జవదేకర్
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తనదైన శైలిలో అభివర్ణించారు. లోక్ సభ ఎన్నికలు 'ధూమ్' అయితే, తాజా అసెంబ్లీ ఎన్నికలు 'ధూమ్ 2' అని పేర్కొన్నారు. ఈ రెండు చిత్రాలు బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పుణేలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎంతో ఉత్సాహంతో పోలింగ్ లో పాల్గొంటున్నారని చెప్పారు. ప్రజలు సుపరిపాలన కోసం ఓటేస్తున్నారని, బీజేపీకి తిరుగులేని ఆధిక్యం కట్టబెట్టేందుకు ఓటేస్తున్నారని పేర్కొన్నారు. చాన్నాళ్ళ తర్వాత మహారాష్ట్రలో ఏక పార్టీ పాలన రానుందని జోస్యం చెప్పారు.