: బస్సును ఆఫీసుగా మార్చుకున్న చంద్రబాబు


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన విశాఖపట్నంలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే ఆయన పాలన సాగిస్తున్నారు. పటిష్టమైన నిర్మాణాలు సైతం హుదూద్ తుపాను తీవ్రతకు దెబ్బతిన్నాయి. ఎయిర్ పోర్టు, ప్రభుత్వ భవనాలు, రాడార్ కేంద్రం, వాణిజ్య సముదాయాలు రూపురేఖలు కోల్పోయాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు తన బస్సునే కార్యాలయంగా మార్చుకున్నారు. అధికారులతో సమీక్షలు, మీడియా సమావేశాలు, రాష్ట్ర పాలన అంతా ఆ బస్సు నుంచే సాగిస్తున్నారు. సోమవారం నుంచి ఆయన విశాఖలోనే ఉన్నారు. తిండి, నిద్ర అన్నీ బస్సులోనే కానిస్తున్నారు. ఇదే బస్సులో ఎన్డీటీవీ ప్రతినిధితో మాట్లాడుతూ, నష్ట తీవ్రతను ఊహించలేమని, అంచనా వేయలేమని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News