: తుపాను బాధితుల కోసం సరుకులు తెస్తే... విమానాశ్రయం అధికారుల నిరాకరించారు!


హుదూద్ తుపాను బీభత్సానికి అతలాకుతలమైన బాధితులకు సాయం చేసేందుకు గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంత వాసులు పెద్దమనసుతో 25 వేల పులిహోర ప్యాకెట్లు, 25 వేల వాటర్ ప్యాకెట్లు, 2 వేల దుప్పట్లు, 2 వేల టవల్స్ తీసుకుని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. విమానాశ్రయాధికారులకు విషయం వివరించారు. వాటిని విశాఖపట్టణం చేర్చాలని అర్ధించారు. ఆహార పదార్థాలు తీసుకెళ్లేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ విమానాశ్రయాధికారులు ఆ సరుకుల రవాణాకు నిరాకరించారు. దీంతో, తాడేపల్లి వాసులు విమానాశ్రయం వద్ద ఆందోళన నిర్వహించారు. తాము సేకరించిన వస్తువులను తీసుకెళ్లాలంటూ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News